
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫోటోలను తిలకించారు.
Also Read :- విమోచన దినోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది : గవర్నర్
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మూడు రోజుల పాటు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరిగాయి. చివరి రోజు ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛ లభించిన ఘట్టాలను, ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా ఫోటోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విమోచన దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహుమతులను అందజేశారు.