తెలంగాణలో 17 స్థానాలకు 443 మంది పోటీ

తెలంగాణలో 17 స్థానాలకు 443 మంది పోటీ

మొదటి దశ లోక్ సభ ఎన్నికలకు  గురువారంతో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 17  లోక్ సభ స్థానాలకు మొత్తం 503 మంది నామినేషన్ వేశారు. ఇందులో 60 మంది అభ్యర్థులు గడువు ముగిసే  సరికి తమ నామినేషన్లను వెనక్కి తీసుకోగా.. మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  అత్యధికంగా నిజామాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాలకు ఎక్కవ నామినేషన్లు వేశారు. నిజామాబాద్ లోక్ సభ స్థానానికి 189 మంది నామినేషన్ వేశారు. ఇందులో నలుగురు విత్ డ్రా చేసుకోగా..185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  సికింద్రాబాద్ లోక్ స్థానానికి 30 నామినేషన్లు వస్తే నలుగురు విత్ డ్రా చేసుకోగా 28 మంది అభ్యర్థులు పోటిలో ఉన్నారు. అత్యల్పంగా మెదక్ లో 10 మంది అభ్యర్థులు, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా నామినేషన్లు వేసిన నిజామాబాద్‌లో బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని  రజత్ కుమార్ చెప్పారు.