మెదక్, వెలుగు: మెదక్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే రోహిత్ కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మున్సిపల్మాజీ చైర్మన్ చంద్రపాల్, మాజీ వైస్ చైర్మన్అశోక్, ఏఎంసీ మాజీ చైర్మన్మధుసూదన్రావు తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వారు మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మెదక్ అభివృద్ధికి నిధులు కోరగా సానుకూలంగా స్పందించి రూ .84.24 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు.
రెండు మూడు రోజుల్లో జీవో వస్తుందని త్వరలోనే ఎమ్మెల్యే చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతీ వార్డులో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ఇదివరకే మంజూరైన రూ.33 కోట్లతో చర్చిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో రూ.50 కోట్లతో పట్టణంలోని ఆయా వార్డుల్లో వివిధ పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఆంజనేయులు, ముత్యం, పవన్, తాహేర్ అలీ, రమేశ్, దయాసాగర్, నితీశ్, ఉమర్, దేవులా, ప్రవీణ్, నాగరాజు,అమీర్, బాలరాజ్, స్వరూప, శ్రీను, ముజాంబిల్, మైసన్ పాల్గొన్నారు.
