పెండింగ్ చార్జీలపై మినిస్టర్ తో మాట్లాడుతా : మాజీ మంత్రి హరీశ్రావు

పెండింగ్ చార్జీలపై మినిస్టర్ తో మాట్లాడుతా : మాజీ మంత్రి హరీశ్రావు

సిద్దిపేట రూరల్, వెలుగు: గత నాలుగు నెలలుగా పెండింగ్​లో ఉన్న కాస్మొటిక్ చార్జీలపై  ఫైనాన్స్ మినిస్టర్ తో మాట్లాడి వెంటనే విడుదల అయ్యేలా చూస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. మంగళవారం రాత్రి సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్ పల్లి గురుకుల స్కూల్​లో 650 మంది విద్యార్థులకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. 2004లో  తాను యువజన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ గురుకుల స్కూల్​ను సిద్దిపేటకు తీసుకువచ్చానని అనంతరం తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.14 కోట్లతో పక్కా బిల్డింగ్ నిర్మించి ఇచ్చానని గుర్తు చేశారు.

 గతంలో కాస్మొటిక్ చార్జీలు స్టేట్ గురుకులాలకు ఇచ్చేవారు కాదని తానే చార్జీలు వచ్చేలా చేశానన్నారు. తెలంగాణ రాకముందు ఒకటి రెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని తెలంగాణ వచ్చాక 34 జిల్లాలకు 34 కాలేజీలను మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాజనర్సు, అల్లం ఎల్లం, సర్పంచ్ నాగుల స్రవంతి ప్రశాంత్, రవీందర్ పాల్గొన్నారు.