బెల్లంపల్లి రూరల్, వెలుగు: ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోగా ఆయనకు మనుమరాలు తలకొరివి పెట్టింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవుడం గ్రామానికి చెందిన గంగిరెడ్డి లచ్చిరెడ్డి(55) అనారోగ్యంతో మంగళవారం చనిపోయాడు. కాగా ఆయనకు కొడుకులు లేరు. కూతురు స్రవంతి సైతం గతంలోనే చనిపోయింది. కాగా స్రవంతి బిడ్డ హర్షిత అమ్మమ్మ తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటోంది. దీంతో తాతకు మనుమరాలే తలకొరివి పెట్టింది.
