ఆ రెండు మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరాలి : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

ఆ రెండు మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరాలి : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

కొండాపూర్, వెలుగు: సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలపై కాంగ్రెస్​జెండా ఎగరాలని, అందుకోసం కార్యకర్తలు కృషి చేయాలని పీసీసీ వర్కింగ్  ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. మంగళవారం మల్కాపూర్ చౌరస్తాలోని వేంకటేశ్వర గార్డెన్ లో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్​కార్యకర్తల సమావేశానికి టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డితో కలిసి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను గతంలోనే ప్రకటించానాని ఒకవేళ రిజర్వేషన్లు మారినా తాను చెప్పిన అభ్యర్థి పేరునే పార్టీ ప్రకటిస్తుందన్నారు. వారిని తప్పకుండా గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ నుంచి ఒకరే పోటీ చేయాలని ఎవరూ రెబల్​గా పోటీ చేయవద్దన్నారు. 

సదాశివపేట మున్సిపాలిటీకి ఇన్​చార్జిగా సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, వసీంభాయ్, ఆంజనేయులు, సంగారెడ్డి మున్సిపాలిటీ కి ఇన్​చార్జిగా అనంత కిషన్, బొంగుల రవి, జార్జ్  కొనసాగుతారని వారి సలహాలు తీసుకోవాలని సూచించారు. 

ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలు చేసినా తాను సీఎం నుంచి నిధులు తీసుకొస్తానని హామీనిచ్చారు. ఎన్నికల్లో కష్టపడ్డ వారికే గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. తాను కూడా మున్సిపల్ చైర్మన్ నుంచే ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు. సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, ఆంజనేయులు, పేట మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, చిదురుప్ప రఘు పాల్గొన్నారు. 

 సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా అలవేని నరసింహారెడ్డి 

సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్​పర్సన్​గా కొండాపూర్​కు చెందిన అలవేణి నరసింహారెడ్డినియామకమయ్యారు. జగ్గారెడ్డి నియామకపత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ సదాశివపేట మార్కెట్ కమిటీ పరిధిలోని రైతులకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు.