స్వీట్ 16 : రాష్ట్రంలో గెలిచే సీట్లపై ఎవరి అంచనాలు వారివే

స్వీట్ 16 : రాష్ట్రంలో గెలిచే సీట్లపై ఎవరి అంచనాలు వారివే

రాష్ట్రంలోని 16 లోక్ సభ స్థానాలనూ గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామని సీఎం కేసీఆర్ ధీమాగా ఉన్నా రు. మిత్రపక్షం ఎంఐఎం గెలిచే హైదరాబాద్ తో కలిపి మొత్తం 17 సీట్లూ తమ చేతిలోనే ఉంటాయని తిరుగులేని నమ్మకంతో ఉన్నా రు. మూడు నెలల కిందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లతో భారీ మెజారిటీ సాధించింది . ఆ తర్వాత వరుసగా టీఆర్ఎస్ లో చేరిన విపక్ష ఎమ్మెల్యే లతో బలం 100 సీట్లకు చేరింది . వారితో పాటే పలు నియోజకవర్గాల నుంచి ఇతర పార్టీల మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు కూడా గులాబీ పార్టీలో చేరారు. ఇవన్నీ అంశాల కారణంగా 16 సీట్లు కచ్చితంగా గెలుస్తామని భావిస్తోంది. కేంద్రంలో మోడీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందనీ, అదే సమయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాం ధీపై జనానికి అంత గురి లేదని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. దీంతో ఇతర పార్టీలే కీలకం అవుతాయనీ, అందువల్ల జాతీయ పార్టీలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరంలేదని సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలిచి, కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తే నిధులు, ప్రాజెక్టుల విషయంలో ప్రయోజనాలు పొందొచ్చని ఆయన చెబుతున్నారు. ప్రధానమంత్రి ఎవరు కావాలో నిర్ణయిం చడంతో పాటు తాను ప్రతిపాదిస్తున్న జాతీయ ఎజెండాను అమలు చేయిం చవచ్చని ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. అదే జరిగితే కేసీఆర్ కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఐదు‘గురి’ కాం గ్రెస్ ఇక అసెంబ్ లీ ఎన్నికల్లో అంచనాలు తప్పినా లోక్ సభ ఎన్నికల్లో పరిస్థితి మారుతుందని కాంగ్రెస్ నమ్ముతోంది . దేశానికి ప్రధాన మంత్రిని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఓటర్లు జాతీయ పార్టీవైపు చూస్తారని ఆశిస్తోంది . అలాగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిణామాలతో ఓటర్ల ఆలోచన మరోలా ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆ ఎన్ని కల్లో బలంగా పనిచేసిన అంశాలు ఇప్పుడు ప్రభావం చూపించేవి కావనీ, పార్టీ ఫిరాయిం పుల అంశాన్ని జనం వ్యతిరేకిస్తారని వారు నమ్ముతున్నారు.

దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ పరిధిలోని ఐదు సీట్లలో గెలుపుపై ఆశలు పెట్టుకుంది . బలమైన, సీనియర్ అభ్యర్థులను రంగంలోకి దించడం, స్థానికంగా ఉన్న అంశాలు తమకు కలిసొస్తా యని నమ్ముతోంది . ప్రధానంగా చేవెళ్ల, ఖమ్మం , మల్కాజ్ గిరి, నల్గొండ, భువనగిరి స్థానాలపై సీరియస్ గా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది . చేవెళ్లలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుం చి గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. ఈ సీటు పరిధిలో ఇన్నాళ్లు పెద్ద దిక్కు గా ఉన్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన తాండూరు సీటు కాంగ్రెస్ గెలుచుకుంది . కొం డాకు చేవెళ్ల పరిధిలోని 7 అసెంబ్ లీ సెగ్మెంట్లలో సొంత యూత్ గ్రూపులు ఉన్నాయి. ఖమ్మం సీటు పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒకే అసెంబ్ లీ సీటు గెలవడంతో ఈ సీటుపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఎన్ని కల తర్వాత ఐదుగురు ఎమ్మెల్యే లు టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఎమ్మెల్యే లు పోయినా కేడర్ పోలేదంటున్నా రు కాంగ్రెస్ నేతలు. ఈ సీటుపరిధిలో ముస్లిం ఓట్లను ఆ పార్టీ నమ్ముకుంది. నల్గొండలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ రేవంత్ రెడ్డి బలమైన అభ్యర్థులుగా గట్టి పోటీ ఇస్తారని కాంగ్రెస్ నమ్ముతోంది.