ఈసీ రిపోర్ట్ : లోక్ సభ ఎన్నికల పోలింగ్ 62.69 శాతం

ఈసీ రిపోర్ట్ : లోక్ సభ ఎన్నికల పోలింగ్ 62.69 శాతం

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో కోటీ 86 లక్షల 17 వేల 91 మంది ఓటు వేశారని, 62.69 శాతం పోలిం గ్ నమోదైందని ఎన్ని కల సంఘం తెలిపింది. పోలింగ్‌ పూర్తి వివరాలను ఆదివారం ప్రకటించింది . గురువారం ఎన్నికలు ముగియగా నాలుగు రోజులకు వీటిని వెల్లడించింది. గురువారం సాయంత్రం, శుక్రవారం సాయంత్రం కూడా పోలిం గ్ శాతాలను ప్రకటించి నప్పటికీ .. పూర్తి ఓట్లు, పోలైన ఓట్లను జెండర్ వారీగా ఆదివారం వెల్లడించిం ది. ఏపీలో మాత్రం ఎన్నికలు ముగిసిన తెల్లారే పూర్తి వివరాలను ప్రకటించడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 2,97,08,599 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,49,19,751 మంది పురుషులు ఉండగా.. అందులో 93,73,320 మంది (62.82శాతం) ఓటేశారని ఈసీ తెలిపింది. 1,47,76,024 మంది మహిళా ఓటర్లు ఉండగా.. అందులో 92,42,193 మంది (62.55శాతం) ఓటేశారని పేర్కొంది. 1504 మంది థర్డ్‌ జెండర్లు ఉండగా..అందులో 232 మంది (15.43శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించింది. ఖమ్మంలో అత్యధికంగా 75.16 శాతం పోలింగ్‌ నమోదైంది.

అయితే ఇక్కడ 75.28 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఈసీ ప్రకటించడం గమనార్హం. పూర్తి వివరాలు వచ్చేసరికి ఖమ్మంలో 0.12 శాతం పోలింగ్ తగ్గింది. ఖమ్మం తర్వాత అత్యధికంగా భువ నగిరిలో 74.39%, నల్గొండలో 74.11%, మెదక్ లో 71.72% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో అత్యల్పం గా 44.75% రికార్డయింది. సికిం ద్రాబాద్ లో 46.26%, మల్కాజ్ గిరిలో 49.40% చొప్పున ఓట్లు పోలయ్యాయి. రిజర్వ్​డ్‌ స్థా నాల్లో ఎక్కువే రాష్ట్రంలోని రిజర్వ్​డ్‌ స్థా నాలైన ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, నాగర్ కర్నూల్‌, పెద్దపల్లిలో మిగతా లోక్ సభ స్థానాల కంటే ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్ లో 71.44 %, మహబూబాబాద్ లో 68.79 %, పెద్దపల్లిలో 65.43 %, వరంగల్ లో 63.65%, నాగర్ కర్నూల్ లో 62.29 % చొప్పున పోలింగ్‌ నమోదైంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే పాలేరులో అత్యధికంగా 82.87% ఓట్లు పోలవగా, అత్యల్పం గా మలక్ పేట లో 37.40 శాతంగా రికార్డయింది.