
హైదరాబాద్, వెలుగు: యూత్ ఆసియా గేమ్స్‌లో ఇండియా మెన్స్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తెలంగాణకు చెందిన లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎంపికయ్యాడు. ఈ నెల 19 నుంచి 23 వరకు బహ్రెయిన్‌లో జరిగే ఇండియా టీమ్ బరిలోకి దిగనుంది. శ్రీనివాస్ రెడ్డి కోచ్‌గా ఎంపిక కావడం పట్ల తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని వీరేష్, జనరల్ సెక్రటరీ ఎం. మహేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యక్తికి ఈ గౌరవం దక్కడం చాలా గొప్పగా ఉందన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కబడ్డీ టీమ్ గోల్డ్ మెడల్ సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఉత్తర్పల్లి గ్రామంలో జన్మించిన శ్రీనివాస్ రెడ్డికి కోచ్‌గా మంచి అనుభవం ఉంది. దుబాయ్ మాస్టర్స్ టోర్నీలో టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించాడు. జూనియర్ జట్టుకు ఆసియా చాంపియన్‌షిప్‌లో, సీనియర్ విమెన్స్ జట్టుకు ఆసియా గేమ్స్–2018లో కోచ్‌గా సేవలందించాడు. ఆస్ట్రేలియా, కొరియా, బంగ్లాదేశ్ జట్లతో పాటు ప్రొ కబడ్డీ లీగ్‌లో హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, తెలుగు టైటాన్స్ ఫ్రాంచైజీలకు కోచ్‌గా పని చేశాడు.