దుబాయిలో తెలంగాణ వాసి మృతి

దుబాయిలో తెలంగాణ వాసి మృతి
  • ట్రక్కులో వెళ్తుండగా యాక్సిడెంట్ .. స్పాట్ డెడ్ 
  • జగిత్యాల జిల్లా అల్లీపూర్ లో విషాదం

రాయికల్, వెలుగు: ఉపాధి కోసం గల్ఫ్​కు వెళ్లిన తెలంగాణకు చెందిన ఒకరు అక్కడ జరిగిన యాక్సిడెంట్ లో చనిపోయాడు. జగిత్యాల జిల్లా రాయికల్​మండలం అల్లీపూర్​ గ్రామానికి చెందిన దాసరి రమేశ్​(​42) కొన్నేండ్ల కింద ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. అక్కడి ఓ బేకరీలో పని చేస్తున్న రమేష్​ శుక్రవారం ట్రక్కులో వెళ్తుండగా మరో ట్రక్కు వచ్చి ఢీకొట్టడడంతో స్పాట్‌లో చనిపోయాడు.

దీంతో అతని  స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రమేశ్​​కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. డెడ్ బాడీని త్వరగా రప్పించేలా చర్యలు చేపట్టాలని కుటుంబసభ్యులు, గ్రామస్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు