
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్‌లో ఓ కేసు విచారణ నిమిత్తం తీసుకువస్తుండగా ఓ యువకుడు మూర్ఛతో మృతి చెందాడు. ఈ సంఘటన2023 ఆగస్టు 26 శనివారం రాత్రి బెల్లంపల్లి పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఈ ఘటన పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డవ్వగా దృశ్యాలు బయటపడ్డాయి. ఓ మహిళ ఇంటిపై దాడికి సంబంధించిన కేసులో ఆ వ్యక్తిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
కీర్తి అంజి (25) అనే యువకుడు తన మొబైల్ ఫోన్‌ని ఉపయోగిస్తుండగా పోలీస్ స్టేషన్‌లోని కుర్చీపై కూర్చొని అకస్మాత్తుగా మూర్ఛకు గురయ్యాడు. వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై యువకుడి కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేసారా లేదా అనేది ఇంకా తెలియలేదు.