పరేడ్ గ్రౌండ్‌‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు

పరేడ్ గ్రౌండ్‌‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆర్మీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కల్చరల్ ప్రోగ్రాంకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కాలుకు పట్టి, స్టిక్ సహాయంతో హాజరయ్యారు. ఆయనకు ఆర్మీ అధికారులు స్వాగతం పలికారు. ఆర్మీ సిబ్బంది ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆయన తిలకించారు. 

ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆయుధాల ఎగ్జిబిషన్ ను ఆర్మీ అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్మీ గన్స్, బులెట్స్, రాకెట్స్, మిషెల్స్ తో పాటు అనేక ఆయుధాలు పబ్లిక్ ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు. గత నెల 24వ తేదీన మంత్రి కేటీఆర్ కాలుకు గాయమైన సంగతి తెలిసిందే. దాదాపు 21 రోజుల తర్వాత బయటకు వచ్చారు. విశ్రాంతి సమయంలో ఆయన ఇంటి నుంచే పని చేశారు.