RTC కార్మికులను మీడియానే రెచ్చకొడుతుంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్

RTC కార్మికులను మీడియానే రెచ్చకొడుతుంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్

కేసీఆర్ ఆర్టీసీకి మంచి చేయాలనుకుంటున్నరు
మీడియానే కార్మికులను రెచ్చకొడుతుంది


ఆర్టీసీకి సీఎం కేసీఆర్ మంచి చేయాలని చూస్తుంటే మీడియానే కార్మికులను రెచ్చకొడుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన… ఆర్టీసీ సమ్మె ఎక్కువ కావడానికి కారణం మీడియా సంస్థలేనని అన్నారు. కార్మికులకు నాయకులకు గ్యాప్ పెంచేలా మీడియా చేస్తుందని చెప్పారు. మీడియా ప్లాన్ ఏంటంటే… కార్మికులను రెచ్చగొట్టాలె, చర్చలు జరుగకుండ చేయాలని మీడియా సంస్థలు చూస్తున్నాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

లేని సమ్మెను ఉన్నదన్నట్టుగా మీడియా చూపెడుతుందా అని రిపోర్టర్ అడుగగా.. మీ అంతరాత్మపై… మీ పిల్లల మీద ఒట్టేసుకుని చెప్పండి కార్మికులకు మీడియా న్యాయం చేయాలని చేస్తున్నదా అని ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వానికి, కార్మికులకు గ్యాప్ పెట్టి దూరం పెరిగేటట్టు చేస్తున్నారని అన్నారు. మీరు.. ఇంకా కొంతమంది మీడియా వాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.