
రాష్ట్రంలో రెండు టీచర్ , ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థా నాలకు నేడు పోలింగ్ జరగనుంది . శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఓటింగ్ జరగనుంది . ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మెదక్, కరీంనగర్ , నిజామాబాద్ , ఆదిలాబాద్ టీచర్ ఎమ్మె ల్సీ సెగ్మెంట్ నుంచి ఏడుగురు బరిలో ఉన్నారు. ఈసెగ్మెంట్ లో 23,214 మంది ఓట్లర్లుండగా, 253 పోలింగ్ స్టేష న్లను రెడీ చేశారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 17 మంది పోటీ పడుతున్నారు. ఈ సెగ్మెంట్ లో 1,96,321 మంది ఓటర్లుం డగా, 376 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మె ల్సీ స్థా నం నుంచి 9 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్ లో 20,888 ఓటర్లకుగానూ185 పోలింగ్ బూత్ లను సిద్ధం చేశారు. ఎమ్మె ల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్యోగులు, టీచర్లకు ఈసీ ఈఎల్ అవకాశం కల్పించింది. ఈ నెల 26న కౌంటింగ్ జరగనుంది . గత నెల 25న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, మార్చి 5 వరకూ నామినేషన్ లు స్వీకరించారు.
ఈ నెల 20తో ప్రచారం ముగిసింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ, పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ , యూఎస్ పీసీ అభ్యర్థి, యూటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నర్సిరెడ్ డి, పీఆర్ టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సరోత్తంరెడ్ డి మధ్య పోటీ నెలకొన్నదని టీచర్లు చెప్తున్నారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ సెగ్మెంట్ లో సిట్టింగ్ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డి, యూఎస్ పీసీ అభ్యర్థి కొండల్‌రెడ్ డి(టీపీటీఎఫ్ ), మాజీ ఎమ్మె ల్సీ మోహన్ రెడ్డి, పీఆర్ టీయూ అభ్యర్థి రఘోత్తంరెడ్డి మధ్య పోటీ నెలకొన్నది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థా నంలో గ్రూప్ 1 అధికారుల సంఘం వ్యవస్థా పక అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ , కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సుగుణాకర్ రా వు, షబ్బీర్ అలీ, రంజిత్‌మోహన్ , ఎడ్ల రవి పోటీలో ఉన్నారు. టీచర్ , గ్రాడ్యుయేట్ స్థా నాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు.