మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల

మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల
  • వెబ్‌‌సైట్‌‌లో ర్యాంకులు, మెరిట్ లిస్ట్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ 2026–-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ మార్కులు, ర్యాంకు వివరాలను అధికారిక వెబ్‌‌సైట్ http://tgms.telangana.gov.in లో చూసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్​చారి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

అభ్యర్థులు తమ వివరాలతో లాగిన్ అయ్యి ర్యాంకు కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఏప్రిల్ 19న నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మోడల్ స్కూల్ ప్రవేశాల కోసం మొత్తం 37,216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 30,545 (82 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారని, 6,671 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.