ఎంసెట్, ఐసెట్, ఈసెట్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్

ఎంసెట్, ఐసెట్, ఈసెట్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్
  • ఎంసెట్, ఐసెట్, ఈసెట్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్
  • సెపెంబర్ 2 నుంచి బీఫార్మసీ, ఫార్మాడీ సీట్లకు కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు : టీఎస్ ఎంసెట్(బైపీసీ) అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజైంది. సెప్టెంబర్ 2న ప్రక్రియ మొదలై 26తో ముగుస్తుందిది. గురువారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అధ్యక్షతన అడ్మిషన్ల కమిటీ సమావేశమైంది. ఇందులో విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, కౌన్సిల్ వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, మహమూద్, ఎస్బీటెట్ సెక్రటరీ పుల్లయ్య, జేడీ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్ ఎంసెట్ బైపీసీ, టీఎస్​ ఐసెట్, టీఎస్ ఈసెట్ తదితర సెట్లకు సంబంధించిన అడ్మిషన్లపై చర్చించి షెడ్యూల్ రిలీజ్ చేశారు. 

సెప్టెంబర్​లో బీఫార్మసీ కౌన్సెలింగ్ 

బీఫార్మసీ, ఫార్మాడీ, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్ (బైపీసీ)–2023 అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్​లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్​ కౌన్సెలింగ్​లో భాగంగా సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఆన్​లైన్ రిజిస్ర్టేషన్ల ప్రక్రియ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 4, 5 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, నాలుగు నుంచి 7వ తేదీ వరకు  వెబ్ ఆప్షన్ల కొనసాగనున్నాయి. సెప్టెంబర్ 11న సీట్ల అలాట్​మెంట్ ఉంటుంది. సీట్లు పొందిన వారు 14లోపు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్ట్  చేయాలి.


= ఎంసెట్( బీ) ఫైనల్ ఫేనల్ ఫేజ్  అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 17 నుంచి 26 వరకు ఉంటుంది. ఆన్​లైన్ రిజిస్ర్టేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ 17న, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 18న, వెబ్ ఆప్షన్లు 17 నుంచి 19 వరకు ఉంటాయి.  ఫైనల్ ఫేజ్ సీట్లను సెప్టెంబర్ 23న కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 26లోపు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. స్పాట్ అడ్మిషన్స్​ గైడ్​లైన్స్​ను సెప్టెంబర్ 24న వెబ్ సైట్​లో పెట్టనున్నారు. 

29 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్   

బీటెక్, బీఫార్మసీ తదితర కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్​ లో చేరేందుకు నిర్వహించే టీఎస్​ ఈసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఈ నెల29 నుంచి ప్రారంభం కానున్నది. ఆన్​లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడంతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ 29 నుంచి ఆగస్టు1 వరకు ఉంటుంది. ఈ నెల31 నుంచి ఆగస్టు 2 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్​మెంట్ఆగస్టు 8న ఉండనున్నది. సీట్లు పొందిన అభ్యర్థులు12 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెకండ్ ఫేజ్ అడ్మిషన్లలో భాగంగా ఆగస్టు 20, 21 తేదీల్లో ఆన్​లైన్ రిజిస్ర్టేషన్లు, స్లాట్ బుకింగ్ ఉంటుంది. 20 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి, 26న సీట్ల అలాట్​మెంట్​ చేస్తారు.  

ఆగస్టు 14 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ 

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చేనెలలో టీఎస్​ఐసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్  ప్రారంభం కానున్నది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్​లైన్ లో బెసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడంతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆగస్టు 16 నుంచి 19 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్​ కౌన్సెలింగ్​కు సంబంధించి 25న సీట్ల అలాట్మెంట్ చేస్తారు. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్​ లో భాగంగా రిజిస్ర్టేషన్లు, స్లాట్ బుకింగ్ సెప్టెంబర్ 1న ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 2న, ఒకటి నుంచి 3వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న సీట్ల అలాట్​మెంట్ చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు  9వ తేదీలోగా అలాటైన కాలేజీల్లో రిపోర్టు చేయాలి.