మున్సిపల్ పోరుకు సిద్ధమవుతున్న పార్టీలు

మున్సిపల్  పోరుకు సిద్ధమవుతున్న పార్టీలు

మున్సిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించి రేపు టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ సమావేశమవుతోంది. ఎన్నికలకు సంబంధించి కేడర్ కు సూచనలు చేయనున్నారు కేటీఆర్. ఇక కాంగ్రెస్ కూడా స్పీడ్ పెంచింది. ఇవాళ జిల్లా నేతలతో మాట్లాడారు ఉత్తమ్. బీజేపీ కూడా ఈసారి గట్టి పోటీ మేమే ఇస్తామంటోంది.  ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. గాంధీ భవన్ కు అప్పుడే క్యూ కడుతున్నారు టికెట్ ఆశించే నేతలు. ఇవాళ జిల్లా నేతలతో మాట్లాడిన ఉత్తమ్.. గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు. స్థానికంగానే మేనిఫెస్టోలు తయారు చేయాలని నిర్ణయించారు. అలాగే బీసీలకు యాబై శాతం సీట్లిస్తూ.. యువత, విద్యావంతులకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. క్షేత్రస్థాయిలో తమకున్న కేడరే తమ బలమని ఆపార్టీ నేతలంటున్నారు. షెడ్యూల్ విషయంలో అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం.. అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.