
రాజపేట, వెలుగు : కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మంగళవారం హైదరాబాద్ లో రాజపేట మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రసాదాన్ని ఆయనకు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. రాజపేట మండలంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నట్లు నాయకులు తెలిపారు.
మంత్రిని కలిసినవారిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ గౌడ్, నాయకులు పాండవుల బసవయ్య, కరాటే బాలు, నకిర్తి రాజు, భానుప్రసాద్ తదితరులు ఉన్నారు.