ఖమ్మం జిల్లాలో 70 కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

ఖమ్మం జిల్లాలో 70 కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

తల్లాడ, వెలుగు: నకిలీ పత్తి విత్తనాల స్థావరంపై మంగళవారం ఖమ్మం జిల్లా తల్లాడ పోలీసులు దాడి చేశారు. ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..  ఈ నెల 4న పోలీసులు, వ్యవసాయ ఆఫీసర్లు టీమ్​ గా ఏర్పడి తల్లాడ మండలం పాత మిట్టపల్లి గ్రామంలో దాడులు నిర్వహించాగా,  నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముగ్గురి వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 12 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

 వారిని విచారించగా ఎర్రుపాలెం మండలం కాసారం గ్రామానికి చెందిన బ్రహ్మాజీ, ఏపీ రాష్ట్రం నూజివీడుకు చెందిన సాంబయ్య అనే వ్యక్తులు వద్ద నుంచి నకిలీ విత్తనాలు తెచ్చి అమ్ముతున్నట్లు తేలింది. ఈ మేరకు మంగళవారం ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేసి 1.80లోల  విలువచేసే 65 కేజీల లూజు విత్తనాలు, 450 గ్రాములు బరువు 12 ప్యాకెట్లు కలిపి  మొత్తం 70 కేజీల బిజీ 3 పత్తి విత్తనాల తోపాటు ప్యాకింగ్ కవర్లు, మిషన్, కాటాను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇప్పటివరకు మొత్తం ఏడుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.