
తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే అధిష్టానం వీరికి శాఖలు కేటాయించలేదు. డిసెంబర్ 8న సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చలు జరిపి స్పష్టత తీసుకున్నారు. సీనియర్ నేతలు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ, ఉత్తమ్ కు సివిల్ సప్లై, నీటిపారుదల శాఖను కేటాయించారు. హోంశాఖను ఎవరికీ కేటాయించలేదు
మంత్రులకు శాఖలు
- భట్టి విక్రమార్క: ఆర్థిక, ఇంధన శాఖ
- తుమ్మల నాగేశ్వరరావు: వ్యవసాయ శాఖ
- జూపల్లి కృష్ణారావు: ఎక్సైజ్ శాఖ
- ఉత్తమ్ కుమార్ రెడ్డి: ఇరేగషన్, పౌరసరఫరాలు
- దామోదర రాజనర్సింహ: వైద్య, ఆరోగ్య
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి: ఆర్‌అండ్‌బీ
- దుద్దిళ్ల శ్రీధర్‌బాబు: ఐటీ, అసెంబ్లీ వ్యవహారాలు
- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి: రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
- పొన్నం ప్రభాకర్: రవాణా, బీసీ సంక్షేమ శాఖ
- సీతక్క: పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ
- కొండాసురేఖ: అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ -