రామప్పలో క్యూఆర్ కోడ్ బోర్డులు

రామప్పలో క్యూఆర్ కోడ్ బోర్డులు

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు :  యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప  టెంపుల్​లో  కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో డిఫరెంట్లీ ఏబుల్ (మూగ, చెవిటి) టూరిస్టుల సౌలత్​ కోసం క్యూఆర్ కోడ్ బోర్డు మంగళవారం ఏర్పాటు చేసినట్లు టూరిజం శాఖ జిల్లా అధికారి మల్లేశం తెలిపారు.  

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలైన గోల్కొండ, రామప్పలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ బోర్డులో ఏర్పాటు చేశామన్నారు. డిఫరెంట్లీ ఏబుల్ సందర్శకులు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే  టెంపుల్ విశిష్టత ఇండియన్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్​ల్లో సైగలు, మాటలు వీడియో రూపంలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కోడ్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ టూరిస్టులకు కూడా ప్రయోజనం ఉంటుందన్నారు.