
నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ కు కరోనా వైరస్ సోకింది. ఆమె భర్త, అత్త, పీఆర్‌ఓకు కూడా పరీక్షలు నిర్వహించగా వారందరికీ పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం మేయర్ తో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కొందరు టీఆర్ఎస్ నేతలకు కూడా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వారంతా హోమ్ క్వారన్ టైన్‌లో చికిత్స పొందుతున్నారు. నగర పాలక సంస్థలోని పలువురు అధికారులు, ఉద్యోగులకు కరోనా లక్షణాలు బయటపడటంతో వారందరూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా.. మేయర్‌ను కాంటాక్ట్ అయిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.