
తెలంగాణలో ఎండలు మండిపోతున్న వేళ.. విద్యార్థులకు ఇబ్బంది అవుతుందన్న కారణంతో బడులకు వేసవి సెలవులను పొడిగించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 12నే బడులు తెరుచుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వేసవి సెలవులు పొడిగించే ఆలోచన లేదని యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే రీ ఓపెన్ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు హెల్తీ డ్రింక్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడులు తెరుచుకున్నా ఎండలు పూర్తిగా తగ్గే అవకాశం లేదు. చాలా మంది పిల్లలు బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే స్కూల్‌కి వస్తున్నట్లు అధికారుల రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని పాఠశాల ఫస్ట్‌డే నుంచి రాగి జావా అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.