మేం వ్యతిరేకం..CAAను సుప్రీం కొట్టేయాలి

మేం వ్యతిరేకం..CAAను సుప్రీం కొట్టేయాలి

కేంద్రం తెచ్చిన సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్( సీఏఏ) తప్పుడు చట్టమన్నారు సీఎం కేసీఆర్.  పౌరసత్వ సవరణకు తాము  వ్యతిరేకమన్నారు. సీఏఏను కేంద్రం వెనక్కి తీసుకోవాలన్నారు.  సీఏఏను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని కొట్టేయాలన్నారు. సీఏఏ పై చాలా మంది సీఎంలతో మాట్లాడానన్నారు.  అవసరమైతే సీఏఏకు వ్యతిరేకంగా 10 లక్షల మందితో సభ పెడతామన్నారు. త్వరలో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యమంత్రుల కాంక్లేవ్ ఏర్పాటు చేస్తానన్నారు కేసీఆర్.  భారతదేశం ప్రజల దేశంగా ఉండాలన్నారు. భారత్ ఏ మత దేశంగా ఉండొద్దన్నారు. బడ్జెట్ సెషన్లో సీఏఏపై చర్చిస్తామన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు.

అభ్యంతరాలు వచ్చినప్పుడు సమీక్ష చేయాలి కానీ అంత మొండ పట్టుదల ఎందుకని కేంద్రాన్నిప్రశ్నించారు.  మన ఇండియా నుంచి పిల్లలు బయటి దేశానికి పోతే దొంగల్లా చూస్తారన్నారు. ప్రపంచంలో అందరు కలిసి బతకాలన్నారు. వంద శాతం సీఏఏ తప్పుడు బిల్లు అని అన్నారు.  ఏది ఏమైనా తాము సెక్యులర్ పార్టీగా ఉంటామన్నారు. దేశంలో కేంద్రానికి వేరే సమస్యలే లేవా అని ప్రశ్నించారు. ఆరేళ్లుగా తాము మతకల్లోలాలను  కంట్రోల్ చేశామన్నారు. ఎన్ ఆర్సీ తీసుకురాబోతున్నామని హోంశాఖ పార్లమెంట్ కు చెప్పిందన్నారు. వివరాలు ఇవ్వాలని .. బలవంతపెట్టబోమని కిషన్ రెడ్డి అంటున్నారు.  అంటే తాము తెలంగాణలో వివరాలు ఇవ్వాలా? వద్దా ? అని ప్రశ్నించారు.