డ్రగ్స్‌‌‌‌ బానిసలే ఇన్‌‌‌‌ఫార్మర్లు

డ్రగ్స్‌‌‌‌ బానిసలే ఇన్‌‌‌‌ఫార్మర్లు

హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్‌‌‌‌ను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఆర్డర్స్, కొరి యర్‌‌‌‌‌‌‌‌, ఏజెంట్స్‌‌‌‌, క్యారియర్స్‌‌‌‌ ద్వారా సప్లయ్‌‌‌‌ జరుగుతూనే ఉంది. డ్రగ్స్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ కోసం హైదరాబాద్ నార్కోటిక్స్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ వింగ్‌‌‌‌(హెచ్‌‌‌‌న్యూ) ఏర్పాటు చేసిన తర్వాత డ్రగ్స్‌‌‌‌ సప్లయర్స్‌‌‌‌ అలర్ట్ అయ్యారు. హెచ్‌‌‌‌న్యూ నిఘా, ఇన్‌‌‌‌ఫార్మర్లకు చిక్కకుండా సప్లయ్ చేస్తున్నారు. రెగ్యులర్ కస్టమర్ల నుంచి డార్క్‌‌‌‌ వెబ్‌‌‌‌, సోషల్‌‌‌‌ మీడియాలో చైన్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌తో ఆర్డర్స్ తీసుకుని, సరఫరా చేస్తున్నారు. 

దీంతో డ్రగ్‌‌‌‌ పెడ్లర్లను పట్టుకోవడంలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో డ్రగ్స్‌‌‌‌ వినియోగదారుల్లో మార్పు తెచ్చేందుకు కౌన్సెలింగ్‌‌‌‌ ఇస్తూనే.. డ్రగ్స్ బానిసలను తమ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఇన్‌‌‌‌ఫార్మర్లుగా పోలీసులు మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా స్టేట్‌‌‌‌ యాంటీ నార్కోటిక్స్‌‌‌‌ బ్యూరో (టీ న్యాబ్‌‌‌‌) స్పెషల్‌‌‌‌ ఆపరేషన్స్ చేపట్టింది. మూడంచెలుగా డ్రగ్‌‌‌‌ మాఫియాకు చెక్‌‌‌‌ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే పట్టుబడిన డ్రగ్‌‌‌‌ పెడ్లర్స్‌‌‌‌ ఫోన్ నంబర్స్‌‌‌‌, సోషల్ అకౌంట్స్‌‌‌‌ ద్వారా రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా డ్రగ్స్ ఆర్డర్‌‌‌‌ ‌‌‌‌చేసే వారిని గుర్తిస్తున్నది. వారి మొబైల్ నంబర్స్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ చేస్తున్న డ్రగ్స్‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌, డెలివరీ చేస్తున్న విధానాలతో ప్రత్యేక డేటా బేస్ సిద్ధం చేస్తున్నది. గతేడాది 2 వేల మందికి పైగా రెగ్యులర్ కస్టమర్లను గుర్తించగా, ఇందులో 600 మంది సప్లయర్స్‌‌‌‌గా మారారని పేర్కొంది. 

ట్రాకింగ్‌‌‌‌ పెడ్లర్స్ ట్రేసింగ్‌‌‌‌ ఇలా..

డ్రగ్స్ బానిసలు సప్లయర్స్‌‌‌‌గా మారడంతో వారిపైనే పోలీసులు నిఘా పెట్టారు. రిపిటేడ్‌‌‌‌గా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారి కాంటాక్ట్స్‌‌‌‌తో పెడ్లర్లను గుర్తిస్తున్నారు. ఇన్‌‌‌‌ఫార్మర్ వ్యవస్థతో డ్రగ్స్ అమ్ముతున్న ప్రాంతాలు, ఏజెంట్ల డేటాను సేకరించారు. పబ్స్, డ్రగ్స్‌‌‌‌ కొరియర్స్‌‌‌‌పై శివారు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. వీకెండ్స్‌‌‌‌ పార్టీలో లిక్కర్‌‌‌‌‌‌‌‌కు బదులు ఎక్కువగా కొకైన్‌‌‌‌, ఎండీఎంఏ, చరస్‌‌‌‌, హెరాయిన్‌‌‌‌తో పార్టీలు చేసుకుంటున్నారు. ఇలాంటి పార్టీలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఆర్గనైజర్స్ వివరాలతో పాటు వారి కాంటాక్ట్స్ సేకరిస్తున్నారు. ఇందులో పబ్‌‌‌‌లకు సమీపంలో కొంత మంది ఏజెంట్లు డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్మానుష్య ప్రాంతాలు, పబ్స్‌‌‌‌ టాయిలెట్స్‌‌‌‌ లాంటి సీక్రెట్‌‌‌‌ ఏరియాల్లో పబ్‌‌‌‌కు వచ్చే కస్టమర్లు డ్రగ్స్‌‌‌‌ కొంటున్నారని అనుమానిస్తున్నారు. 

సెంట్రల్ ఏజెన్సీలతో కోఆర్డినేషన్..

డ్రగ్స్ సప్లయ్‌‌‌‌కి కేరాఫ్ అడ్రస్‌‌‌‌గా మారిన నైజీరియన్స్‌‌‌‌పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్‌‌‌‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్‌‌‌‌ లాంటి సెంట్రల్‌‌‌‌ ఏజెన్సీలతో కలిసి నైజీరియన్స్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. సీపోర్ట్‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పట్టుబడిన 23 మందిలో, 13 మందిని వారి సొంత దేశాలకు పంపారు. గతేడాది నమోదైన 889 డ్రగ్స్ కేసుల్లో అరెస్టయిన 2,495 మందిపై పోలీసులు నిరంతర నిఘా పెట్టారు. ఇందులో 185 మంది డ్రగ్స్ సప్లయర్స్‌‌‌‌ను గుర్తించారు. 1,075 మంది డ్రగ్స్ కన్జ్యూమర్స్‌‌‌‌లో 600 మంది కస్టమర్లను ఇన్‌‌‌‌ఫార్మర్స్‌‌‌‌గా మార్చుకున్నారు. గోవా, ముంబై నుంచి డ్రగ్స్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ జరుగుతున్న విధానాలను గుర్తించారు.

సిటీ కస్టమర్స్‌‌‌‌ అంటేనే  భయపడేలా చేశాం..

డ్రగ్స్‌‌‌‌ సప్లయర్లకు హైదరాబాద్ కస్టమర్స్‌‌‌‌ అంటేనే భయం పుట్టేలా చేశాం. ఇక్కడ డ్రగ్స్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ తగ్గితే సప్లయ్ కూడా ఆగిపోతుంది. కన్జ్యూమర్లలో మార్పులు తెచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చాలా మంది కస్టమర్ల వివరాలు మా దగ్గర ఉన్నాయి. పట్టుబడ్డ వారిపై యాక్షన్ తప్పదు. పెడ్లర్లు, కస్టమర్లు ప్రధాన సప్లయర్స్‌‌‌‌తో డేటాబేస్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కేసులు నమోదైన యాంటీ నార్కోటిక్స్‌‌‌‌ బ్యూరోకు రిపోర్ట్ అవుతాయి. డోపామ్ యాప్‌‌‌‌తో దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయర్స్ సమాచారం ఉంది. స్పెషల్ ఆపరేషన్స్‌‌‌‌ నిర్వహిస్తాం. 

- సీవీ ఆనంద్, డైరెక్టర్,  టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో