కుట్రతోనే నాపై రౌడీషీట్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

కుట్రతోనే నాపై రౌడీషీట్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

ప్రజాసేవ చేస్తున్న నేను రౌడీని ఎలా అవుతా
టీఆర్ఎస్ మంత్రులు ఒకప్పటి రౌడీషీటర్లు…

కేసీఆర్ ప్రభుత్వం కావాలనే చేసింది : రాజాసింగ్

బీజేపీ లీడర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై రౌడీషీట్ ను ఓపెన్ చేశారు పోలీసులు. ఈ విషయంపై  ఆయనతో మీడియా మాట్లాడగా.. ప్రజల మధ్య ఉంటూ వారి సేవ చేస్తున్న తనపై రౌడీషాట్ ఓపెన్ చేయడం దారుణమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కావాలనే ఇటువంటి చర్యలు చేస్తుందని చెప్పారు. పోలీసులు కేసీఆర్ కు గులాంలు అయ్యారని ఆయన అన్నారు. TRS పార్టీలో ఉన్న కొందరు మంత్రులు ఒకప్పటి రౌడీషీటర్లేనని.. వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసే దమ్ము పోలీసులకు ఉందానని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ జవాబు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.