పంచాయతీ సెక్రటరీ 'దళిత బంధు' సర్వే.. సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాల డిమాండ్

పంచాయతీ సెక్రటరీ 'దళిత బంధు' సర్వే.. సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాల డిమాండ్

ఎన్నికల కోడ్ సమయంలో ఓ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగి... దళిత బంధు సర్వే చేపట్టడంతో  ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... సదరు ఉద్యోగిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావు పేట మండలం లింగన్నపేట గ్రామంలోని దళితుల కాలనీలో గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగి మజీద్.. ఇంటింటికి తిరుగుతూ దళిత బంధుపై సర్వే చేపట్టాడు. విషయం తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. ఎన్నికల సమయంలో సర్వే ఎలా చేపడుతున్నారని.. పంచాయతీ సెక్రటరీ ప్రశ్నించారు. నువ్వు ప్రభుత్వ ఉద్యోగివా? లేక అధికార పార్టీ కార్యకర్తవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎలక్షన్ సమయంలో దళిత బంధు పథకంపై సర్వే ఎలా చేస్తావని.. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దళిత బంధు పథకం నువ్వు ఇస్తావా అని ఉద్యోగిని నిలదీశారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లాంఘించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ మజీద్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రతిపక్ష నాయకులు గ్రామ పంచాయతీ ముందు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.