డిసెంబర్ 11 నుంచి పాలిటెక్నిక్ సెమిస్టర్ ఎగ్జామ్స్

డిసెంబర్ 11 నుంచి పాలిటెక్నిక్ సెమిస్టర్ ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని టెక్నికల్ బోర్డు సెక్రెటరీ పుల్లయ్య తెలిపారు. సీ 21 ఒకటీ, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల16 వరకూ ఉంటాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 119 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరగుతాయని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నాం 12గంటల వరకూ మొదటి సెషన్, మధ్యాహ్నాం 2గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ రెండో సెషన్ ఎగ్జామ్స్ ఉంటాయని వెల్లడించారు.