- పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు
షాద్ నగర్, వెలుగు : షాద్నగర్నియోజకవర్గం ఫరూఖ్నగర్మండలం బూర్గులలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్, లింగారెడ్డిగూడలో రూ.29.70 కోట్లతో పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణ పనులకు మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్స్టేట్తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పుట్టిన ఊరిలో ఆయనకు నివాళిగా రాష్ట్రంలోనే మొట్టమొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను బూర్గులలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పాలిటెక్నిక్ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్(లేటరల్ ఎంట్రీ) ప్రవేశం యథాతథంగా కొనసాగుతుందని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
