
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సభ్యులు గురువారం మంత్రి సీతక్కని ఆమె ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ సీతక్కపై రాసిన కవిత్వంతో కూడిన జ్ఞాపికను అందజేసి సన్మానించారు. విజ్ఞాన్ విద్యాసంస్థలు కరస్పాండెంట్ సీహెచ్ నిర్మల రెడ్డి, కార్టూనిస్టు శ్రీరామ్, బొమ్మ వెంకటేశ్, ప్రణిత్ ఉన్నారు