రాష్ట్రంలో కొత్తగా 2,707 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 2,707 కరోనా కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ రోజు 84,280 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,707 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. గత 24 గంటల్లో 582 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.57శాతంగా.. రికవరీ రేటు 96.51 శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 20,461 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో జీహెచ్ఎంసీలో 1,328మందికి కరోనా సోకింది. మేడ్చల్ జిల్లాలో 248, రంగారెడ్డిలో 202 మందికి కోవిడ్ నిర్థారణ అయింది. 

మరిన్ని వార్తల కోసం..

ఏపీలో 24 గంటల్లో 4,348 కేసులు..ఇద్దరు మృతి

పట్టాలు తప్పిన గువాహటి - బికనేర్ ఎక్స్ప్రెస్