అత్యాచారానికి గురైన.. ఎస్సీ బాధితులకు పరిహారం రిలీజ్

అత్యాచారానికి గురైన.. ఎస్సీ బాధితులకు పరిహారం రిలీజ్
  • రూ.7 కోట్లు రిలీజ్ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 
  • గరిష్టంగా రూ.8.5 లక్షలు, కనిష్టంగా రూ.లక్ష

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడేండ్ల తరువాత ఎస్సీ అత్యాచార బాధితులకు పరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.7 కోట్లు రిలీజ్ అయ్యాయని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నిధులను జిల్లా ట్రెజరీలకు బదిలీ చేసినట్టు తెలిపారు.

 రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,800 మంది బాధితులకు  రూ.35  కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉండగా ఇటీవల రూ.7 కోట్లు విడుదలయ్యాయి. కాగా, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద 47 రకాల వేధింపులు, అత్యాచారాలకు రూ. లక్ష నుంచి రూ.8.25 లక్షల వరకు పరిహారం అందజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు,  మర్డర్, రేప్, సజీవ దహనం మొదలైనవాటికి రూ.8.25  లక్షల వరకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నారు.