పంచాయతీ ఎన్నికల వేళ పలు చోట్ల చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓటర్ లిస్టులో పేరు లేదని కొందరు ఆందోళన చేస్తుంటే.. కొందరు ఫోటోలు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓటరు ఫోటోకు బదులు టెన్త్ క్లాస్ మెమో రావడం చర్చనీయాంశంగా మారింది.
లోకల్ బాడీ ఎన్నికలు ఉన్న క్రమంలో సోనాల గ్రామంలో ఓటరు లిస్టులో పదవ తరగతి మార్కుల పత్రం రావడం సదరు ఓటరును ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటరు పోటోకు బదులు మెమో ప్రింట్ అవ్వడంతో.. ఆ ఓటరు వేణు బోమమోహత ఆందోళన వ్యక్తం చేశాడు.
గ్రామంలో రెండో వార్డులో తనకు ఓటు ఉందని.. కానీ తన ఫోటోకు బదులు మార్క్స్ లిస్టు రావడమేంటని ప్రశ్నించాడు. ఓటర్ గుర్తింపు కార్డుపై తన ఫోటోను ముద్రించాలని కోరుతున్నాడు. ఎన్నికల అధికారుల తీరు పై అగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ఓటరు వేణు.
