గురుకుల ఆప్షన్ల గడువు పెంపు

గురుకుల ఆప్షన్ల గడువు పెంపు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రెసిడెన్షియల్​ఎడ్యుకేషనల్​ఇన్​స్టిట్యూషన్స్​రిక్రూట్​మెంట్​బోర్డు జారీ చేసిన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జోనల్​ఆప్షన్లు ఇచ్చే గడువును అధికారులు పెంచారు. అభ్యర్థులు www.treirb.telanagna.gov.in వెబ్​సైట్ ద్వారా  తమ జోనల్​ఆప్షన్లు ఇచ్చుకోవాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీజీటీలు ఈ నెల 9 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. 

 లైబ్రేరియన్లు, ఫిజికల్​డైరెక్టర్లు, డ్రాయింగ్, ఆర్ట్​ టీచర్లు, క్రాఫ్ట్​ఇన్​స్ట్రక్టర్లు, టీచర్లు, మ్యూజిక్​ టీచర్లు ఆప్షన్లు ఇచ్చే గడువును ఈ నెల 3 నుంచి 9వ తేదీకి పొడిగించామని తెలిపారు. జోనల్​ఆప్షన్లు ఇచ్చేందుకు ఇదే చివరి అవకాశమని, తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.