
- గ్రీన్‌ట్యాక్స్ చెల్లించక ముందే ఫిట్నెస్ చేయించుకోవాలి
- కొత్త రూల్స్ అమలుకు ఆర్టీఏ కసరత్తు
- ఇప్పటివరకు గ్రీన్‌ట్యాక్స్ కడితే ఓకే
- త్వరలో అమలు చేసేందుకు ప్లాన్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్లో15 ఏండ్లు దాటిన వాహనాలకు తప్పనిసరిగా ఫిట్నెస్సర్టిఫికెట్ ఉండాలన్న రూల్అమలు చేయాలని ఆర్టీఏ ఆలోచన చేస్తున్నది. ప్రస్తుతం15 ఏండ్లు దాటిన వాహనాలకు గ్రీన్ టాక్స్ కట్టి మరో ఐదేండ్లు నడిపించుకుంటున్నారు. ఇక నుంచి గ్రీన్ టాక్స్ కు దరఖాస్తు చేసే వారు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకునేలా రూల్స్సవరించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.
కాలం తీరిన వాహనాల వల్ల సిటీలో కాలుష్యం పెరుగుతుందని, ఢిల్లీలో ఏర్పడిన పరిస్థితులు మన దగ్గర ఏర్పడకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ, రాజస్థాన్ లో కూడా ఈ నిబంధన అమలుకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. ఈప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఫిట్నెస్సర్టిఫికెట్లేని వాహనం నేరుగా స్ర్కాప్‌కే పంపించాల్సి ఉంటుంది.
భారీ సంఖ్యలో కాలం తీరిన వాహనాలు
గ్రేటర్ లో కాలం తీరిన వాహనాలు అన్ని రకాలు కలిపి సుమారు 20 లక్షల వరకు ఉంటాయని అంచనా. ఇందులో 16 నుంచి 18లక్షల వరకు టూ వీలర్స్ఉండగా, వెయ్యి ఆర్టీసీ బస్సులు, 3.5 లక్షల వరకు ఫోర్ వీలర్స్ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఇవే కాకుండా ప్రైవేట్ బస్సులు, స్కూల్వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఉన్నాయంటున్నారు. ప్రభుత్వ శాఖల్లోనే దాదాపు 10 వేల వరకు వెహికల్స్ఉన్నాయని చెప్తున్నారు. 15 ఏండ్లు దాటిన తర్వాత వాహనాలు ఫిట్‌గా లేకపోతే స్క్రాప్ చేయాలని, కానీ వాహనదారులు ఎవరూ ముందుకు రావడం లేదంటున్నారు.
శివారు ప్రాంతాల్లో ఉన్న స్ర్కాప్ప్లాంట్లకు రోజుకు 100 వెహికల్స్ కూడా రాకపోవడాన్ని బట్టి చూస్తే ఎన్ని ఏండ్లయినా వాటిని నడుపుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. 60 శాతం మందికి పైగా వాహనదారులు గ్రీన్టాక్స్కట్టకుండానే వాహనాలు నడుపుకుంటున్నారని తమ దగ్గర లెక్క ఉందని, త్వరలో వీటిపై స్పెషల్డ్రైవ్నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, పాత వాహనాలను స్క్రాప్ చేస్తే మోటార్ వాహనాల పన్నుపై 10 నుంచి 15 శాతం రాయితీ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్తున్నారు.