ఎస్టీఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చావ రవి

ఎస్టీఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చావ రవి

హైదరాబాద్, వెలుగు: స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్​టీఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడిగా సీఎన్. భారతి (హర్యానా), ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన చావ రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కలకత్తాలో మూడు రోజులుగా జరుగుతున్న మహాసభల్లో ఎస్టీఎఫ్ఐ జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మొత్తం 23 మంది ఆఫీస్ బేరర్లుగా, 45 మంది కేంద్ర కమిటీ సభ్యులుగా, 87 మంది జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు.

తెలంగాణ నుంచి కేంద్ర కమిటీ సభ్యులుగా సీహెచ్. దుర్గా భవాని, జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఎ. వెంకట్, ఆర్. శారద ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న చావ రవికి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇవ్వడంపై యూటీఎఫ్​ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది.