
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తమ మొండిబాకీల (నాన్-పెర్ఫార్మింగ్ ఆస్తుల– ఎన్‌పీఏల) రికవరీ కోసం 100 ఖాతాలను గుర్తించింది. సుమారు రూ.4 వేల నుంచి 5 వేల కోట్ల విలువైన ఎన్‌పీఏలను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్‌సీల) కు విక్రయించాలని చూస్తోంది. తక్కువ ధరకు ఎన్‌పీఏలను కొనుక్కోని, బ్యాంకులకు బదులుగా ఈ ఏఆర్‌సీలే కస్టమర్ల నుంచి రికవర్ చేసుకుంటాయి.పీఎన్‌బీ సీఈఓ అశోక్ చంద్ర మాట్లాడుతూ, ఈ ఖాతాల్లో సగటున 40–-50శాతం రికవరీ ఆశిస్తున్నామన్నారు. కొన్ని ఖాతాల్లో అయితే 100 శాతం రికవరీ జరగొచ్చన్నారు.