
హైదరాబాద్, వెలుగు: టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల నియామకానికి బుధవారం ఉదయం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్ బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
టీఎస్ఎల్పీఆర్ బీ వెబ్ సైట్ ద్వారా 28న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు చెప్పారు. ఎస్సీ వర్గానికి చెందినవారు ఆన్‌లైన్ దరఖాస్తుతోపాటు తమ కమ్యూనిటీ సర్టిఫికెట్లను కొత్త నిర్దేశిత ఫార్మాట్‌లో (నిర్దిష్ట గ్రూప్ అంటే గ్రూప్– -I /గ్రూప్–-II / గ్రూప్–-III ఉప-వర్గీకరణతో) అప్‌లోడ్ చేయాలని సూచించారు.