ఎకరాకు రూ.25 వేలు అందించాలి

ఎకరాకు రూ.25 వేలు అందించాలి

వైరా, వెలుగు : -మిగ్ జాం తుఫాన్​తో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ రైతు సంఘం డిమాండ్​ చేసింది. బుధవారం సంఘం ఆధ్వర్యంలో వైరా మండలంలో దెబ్బతిన్న పంటలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు పరిశీలించారు.  

అనంతరం వైరా డివిజన్ వ్యవసాయ అధికారి బాబురావు కు పంట నష్టం పై సమగ్ర సర్వే జరిపి పరిహారం అందించాలని వినతిపత్రంఅందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ అధ్యక్షుడు మల్లెంపాటి రామారావు, కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, జిల్లా కమిటీ సభ్యులు వనమా చిన్న సత్యనారాయణ, సీపీఎం మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు


రైతాంగాన్ని ఆదుకోవాలి


మధిర, వెలుగు: తుఫాన్ తో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం మధిర మండలం నిధానపురం గ్రామంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి బాధిత రైతులను పరామర్శించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయని కారణంగా రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు.  కొత్త ప్రభుత్వం అయినా పంటల బీమా పథకాన్ని తెలంగాణలో తీసుకువచ్చి రైతులను ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వెంట బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాల్లపల్లి విజయరాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్ , బీజేపీ మండల అధ్యక్షుడు గుండా చంద్రశేఖర్ రెడ్డి, అమరవాది వెంకటేశ్వర రెడ్డి, యర్రం వీరారెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.