ఎమ్మెల్సీ బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేయలేమన్న సర్కార్ ప్రెస్

ఎమ్మెల్సీ బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేయలేమన్న సర్కార్ ప్రెస్
  • బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేసుడెట్లా!
  • గడువు లోపు పూర్తి చేయలేమన్న సర్కార్ ప్రెస్
  • ప్రైవేట్ ప్రింటింగ్కు పర్మిషన్ ఇవ్వాలని ఈసీకి సీఈవో లెటర్

హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ ఎన్నికల సంఘం (ఈసీ)కు తలనొప్పిగా మారింది. ఎలక్షన్​డేట్​దగ్గర పడుతున్నా, ఇంకా బ్యాలెట్​పేపర్ల ప్రింటింగ్​పై స్పష్టత రావడం లేదు. సాధారణంగా బ్యాలెట్​పేపర్లను రాష్ట్ర ప్రింటింగ్, స్టేషనరీ అండ్​స్టోర్స్​ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రెండు గ్రాడ్యుయేట్​నియోజకవర్గాలకు11.06 లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించాలని తెలంగాణ చీఫ్​ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ఆఫీస్ ఆర్డర్ ఇచ్చింది. అయితే మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్​నియోజకవర్గానికి మాత్రమే 5.62 లక్షల బ్యాలెట్​పేపర్లను ఈ నెల10 వరకు ప్రింట్ చేసి ఇవ్వగలమని గవర్నమెంట్​ప్రింటింగ్​ప్రెస్​సీఈవోకు తెలిపింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి సంబంధించి 5.43 లక్షల బ్యాలెట్​పేపర్లను టైంకు ప్రింట్ చేసి ఇవ్వలేమని చెప్పింది. దీంతో మహారాష్ర్ట, కర్నాటక ప్రభుత్వ ప్రింటింగ్​ప్రెస్​లను సంప్రదించారు. చివరకు రెండు మినహాయింపులు ఇవ్వాలని అనుమతి కోరుతూ ఈసీకి సీఈవో లెటర్ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ప్రింట్ చేయగా, మిగిలిపోయే బ్యాలట్లను ఆ ప్రెస్ ద్వారానే ఔట్ సోర్సింగ్ కింద ప్రైవేట్ ప్రింటింగ్ ప్రెస్ లలో ప్రింట్ చేసేందుకు అనుమతించాలని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లలో పింక్ కలర్ బ్యాలట్లు లేవు కాబట్టి, వైట్ పేపర్లను వాడేందుకు అనుమతించాలని మరో విజ్ఞప్తి చేశారు.

11వ తేదీకల్లా ఏర్పాట్లు పూర్తి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల11వ తేదీ కల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. 13న సాయంత్రం 5 గంటల కల్లా పోలింగ్​మెటిరీయల్​తో పోలింగ్​కేంద్రాలకు చేరుకోవాలి. 14న ఉదయం 8  నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్​జరుగుతుంది. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్​పర్సెంటేజీ వెల్లడించాలి. అదేరోజు రాత్రి 9 గంటల కల్లా బ్యాలెట్​బాక్సులు స్ట్రాంగ్ రూంకు తరలించాలి. పోలింగ్​ వివరాలు మొత్తం సబ్మిట్​చేయాలని పేర్కొన్నారు.