
రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కేంద్రం తాత్కాలికంగా మారింది. సెక్రటేరియట్ కూల్చివేతకు ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం.. శాఖలన్నింటినీ వాటికి తాత్కాలికంగా కేటాయించిన భవనాలకు తరలించింది. వాటికి కేటాయించిన భవనాల్లో కోట్ల రూపాయల ఖర్చుతో ముస్తాబు చేశారు. ఉన్న సెక్రటేరియట్ కూల్చి.. కొత్త భవనాలు కట్టేవరకు అక్కడినుంచే పరిపాలన కార్యక్రమాలు జరగనున్నాయి.
BRK భవన్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి కార్యాలయం కూడా షిఫ్ట్ అవుతోంది. అన్ని ఫైళ్లను కట్టలుకట్టి సిద్ధం చేసిన సిబ్బంది… బీఆర్కే భవన్ కు వాటిని తరలిస్తున్నారు. రేపటినుంచి బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచే అధికారిక కార్యక్రమాలు, పరిపాలన జరగనుంది.