నిజామాబాద్, వెలుగు: మహారాష్ట్ర సర్కార్ జిల్లా బార్డర్‌లోని మంజీరా నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చినందున తెలంగాణ గవర్నమెంట్అలర్ట్ అయింది. బోలేగావ్, గంజ్గావ్ విలేజ్‌లు ఆనుకొని మంజీరాలో క్వారీలు ఓపెన్ కాబోతున్నాయి. ఇసుక వాహనాలు ఎక్కువ శాతం నిజామాబాద్ జిల్లా మీదుగా వెళ్లనున్న నేపథ్యంలో శనివారం రాష్ట్ర మైన్స్‌శాఖ ఎండీ భవేశ్‌మిశ్రా సాలూరా వద్ద బార్డర్ చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర క్వారీల పేరుతో పర్మిషన్ లేకుండా ఇసుక ట్రాన్స్‌పోర్టు నిరోధించడం, రోడ్లను శిథిలం చేసి యాక్సిడెంట్స్కు కారణమయ్యే ఓవర్ లోడ్‌ను అరికట్టడం చెక్ పోస్టు ఏర్పాటు ఉద్దేశ్యమన్నారు.
క్వారీలు నడిచినన్ని రోజులు చెక్పోస్ట్ పనిచేస్తుందన్నారు. మంజీరా నదిలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులను ఆధునిక టెక్నాలజీ వినియోగించి స్పష్టంగా ఏర్పాటు చేశామని ఇసుక తవ్వకాలకు రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉండదని తెలిపారు. ఆన్లైన్ బుకింగ్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దామన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా మైన్స్ ఏడీ సంజయ్, ల్యాండ్ సర్వే ఏడీ అశోక్
