
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ షూటర్ సురభి భరద్వాజ్ కుమార్ సురేంద్ర సింగ్ మెమోరియల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసింది. ఢిల్లీలో బుధవారం జరిగిన విమెన్స్ 50 మీ. రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో తను ఈ పతకం నెగ్గింది.
ఫైనల్లో సురభి 620.8 పాయింట్లతో మూడో స్థానం సాధించింది. రాజస్తాన్ షూటర్ మన్నత్ కౌశిక్ 626 పాయింట్లతో స్వర్ణం కైవసం చేసుకోగా.. పంజాబ్‌కు చెందిన సిఫ్ట్ కౌర్ సమ్రా 622.1 పాయింట్లతో రజతం నెగ్గింది.