కృష్ణాజలాలపై తెలంగాణకు మూడుసార్లు లేఖలు

కృష్ణాజలాలపై తెలంగాణకు మూడుసార్లు లేఖలు

కృష్ణా జలాల విడుదలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల గురించి కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. కృష్ణా నదిపై ఉన్న నీటిపారుదల, విద్యుత్ ప్రాజెక్టులను  కృష్ణా నది నిర్వహణ యాజమాన్య బోర్డుకు అప్పగించాలని ఆదేశించినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు  ఇప్పటిదాకా స్పందించలేదని వెల్లడించింది. కృష్ణా నదిపై ఉన్న అన్ని నీటి పారుదల, విద్యుత్ ప్రాజెక్టులను  బోర్డు పరిధిలోకి తీసుకొస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసింది. 

టీడీపీ ఎంపీ కనక మేడల ప్రశ్న..

‘‘ విద్యుత్ ఉత్పత్తి కోసం కృష్ణాజలాలను తెలంగాణ వాడుకుంటోంది.  కృష్ణా నది నీటి విడుదలపై  తమ ఆదేశాలు పాటించాలని కృష్ణా నది నిర్వహణ యాజమాన్య బోర్డు తెలంగాణా ప్రభుత్వాన్ని పలుమార్లు కోరింది. మూడు సార్లు  లేఖలు కూడా రాసింది’’ అని పేర్కొంది. ఈ అంశంపై టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో  అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.