తెలంగాణ గాయకుడు జై శ్రీనివాస్ కన్నుమూత

V6 Velugu Posted on May 21, 2021

హైదరాబాద్: ప్రముఖ తెలంగాణ గాయకుడు జై శ్రీనివాస్ కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనా తో పోరాడుతూ సికింద్రాబాద్ లోని ఓ ప్రయివేటు తుది శ్వాస విడిచారు. ‘‘జై’’ సినిమాలో " దేశం మనదే , తేజం మనదే , ఎగురుతున్న జండా మనదే ....పాటతో ప్రాచుర్యం పొందారు నేరేడుకొమ్మ శ్రీనివాస్ అలియాస్ జై శ్రీనివాస్. వర్ధమాన నటీనటుల అనేక సూపర్ హిట్ తెలుగు సిమాలకు ఎన్నో పాటలు పాడారు శ్రీనివాస్. సినిమా పాటలతోపాటు ప్రైవేటు ఆల్బమ్ లకు, షార్ట్ ఫిలింలకు, వెబ్ సిరీస్ లకు పాటలు పాడారు. అలాగే దేశ భక్తి పాటలు కూడా పాడారు.
సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ తెలంగాణ గాయకుడు జై శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ని వ్యక్తం చేశారు.

Tagged dies with Corona, , telangana singer Jai Srinivas, singer neredukomma srinivas aliyas jai srinivas, tollywood singer

Latest Videos

Subscribe Now

More News