
ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం దోపిడీ కేసులో.. స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ సంస్థలతో పాటు మరేవైనా ఇతర సంస్థలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఐటీ గ్రిడ్ కంపెనీకి తెలంగాణ పౌరుల డేటా ఎలా వచ్చిందనే దానిపై కూడా.. పోలీసులు దృష్టి పెట్టారు. సేవా మిత్ర యాప్ ద్వారా ఎంత మంది పౌరుల సమాచారాన్ని రాబాట్టారన్న దానిపై విశ్లేషణ జరుపుతున్నారు. నిపుణుల సహకారంతో సిట్ బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది. మాదాపూర్ లోని ఐటీ గ్రిడ్ కార్యాలయానికి వెళ్లారు సిట్ అధికారులు. ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సేకరించిన డేటాను విశ్లేషించేందుకు బెంగళూరుకు చెందిన ఎథికల్ హ్యాకర్స్, సైబర్ నిపుణుల సాయం తీసుకుంటున్నారు.