నందినికి గోల్డ్‌‌‌‌‌‌‌‌

నందినికి గోల్డ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ : తెలంగాణ స్టార్‌‌‌‌‌‌‌‌ అథ్లెట్‌‌‌‌‌‌‌‌ అగసార నందిని.. 63వ సీనియర్‌‌‌‌‌‌‌‌ నేషనల్‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. హర్యానాలోని పంచకులాలో ఆదివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ హెప్టాథ్లాన్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో నందిని 5806 పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. 13.93 సెకన్లలో 100 మీటర్ల పరుగును పూర్తి చేసిన తెలంగాణ అథ్లెట్‌‌‌‌‌‌‌‌.. హై జంప్‌‌‌‌‌‌‌‌లో 1.64 మీటర్ల ఎత్తు నుంచి దూకింది.

షాట్‌‌‌‌‌‌‌‌ పుట్‌‌‌‌‌‌‌‌లో 14.56 మీటర్ల దూరాన్ని నమోదు చేసింది. 200 మీటర్స్‌‌‌‌‌‌‌‌లో 25.23 సెకన్లలో లక్ష్యాన్ని చేరడంతో పాటు లాంగ్‌‌‌‌‌‌‌‌ జంప్‌‌‌‌‌‌‌‌లో 5.85 మీటర్ల దూరం జంప్‌‌‌‌‌‌‌‌ చేసింది. జావెలిన్ త్రోలో ఈటెను 37 మీటర్ల దూరం విసిరిన నందిని 800 మీటర్లలో 2:8.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది.