స్వప్నిల్​కు ఒలింపిక్​ బెర్త్​

స్వప్నిల్​కు ఒలింపిక్​ బెర్త్​

కైరో: తెలంగాణ  స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌.. ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో పతకాల పంట పండిస్తోంది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఇషా–సామ్రాట్‌‌‌‌‌‌‌‌ రాణాతో కూడిన ఇండియా ద్వయం 17–15తో శిఖా నర్వాల్‌‌‌‌‌‌‌‌–సాగర్‌‌‌‌‌‌‌‌ డాంకె (ఇండియా)పై గెలిచి టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో స్వర్ణం గెలుచుకుంది.

ఈ టోర్నీలో ఇషాకు ఇది మూడో గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ కాగా, ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా నాలుగో పతకం కావడం విశేషం. మెన్స్‌‌‌‌‌‌‌‌ 50 మీటర్ల రైఫిల్‌‌‌‌‌‌‌‌ త్రీ పొజిషన్‌‌‌‌‌‌‌‌లో స్వప్నిల్‌‌‌‌‌‌‌‌ కుశాలే 407.6 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌ను దక్కించుకున్నాడు. షూటింగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు ఇది మూడో ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌. భవనీష్‌‌‌‌‌‌‌‌ మెందిరత్తా (మెన్స్‌‌‌‌‌‌‌‌ ట్రాప్‌‌‌‌‌‌‌‌), రుద్రాంక్ష్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ (10 మీ. ఎయిర్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌) ముందున్నారు.