సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినేట్ భేటి కానుంది. ఈ సమావేశంలో కరోనా నియంత్రణ, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, సెక్రటేరియట్ నూతన భవన సముదాయ నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో పాటు సీఎఎస్, డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

