- రాష్ట్ర డీఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్
హైదరాబాద్, వెలుగు : డీఎస్సీలో పోస్టులు బ్యాక్ లాగ్ కాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి కోరారు. ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులకు సంబంధించి 120 పోస్టులు డీఎస్సీలో బ్యాక్ లాగ్ కాకుండా వాటిని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జనరల్ కేటగిరీలో జత చేస్తే ప్రతి అభ్యర్థికి వెసులుబాటు ఉంటుందన్నారు.
బార్డర్ మార్కులు ఉన్న వారికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందని, దీంతో ప్రతి జిల్లాల్లో ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు జనరల్ కేటగిరీలో జత చేయాలని విజ్ఞప్తి చేశారు. నాన్ లోకల్ కోటాలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఆ జాబితా తొలగించాలని డిమాండ్ చేశారు.